కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి | Agra: Local goons allegedly gangrape, murder Dalit woman, torn her body to pieces | Sakshi
Sakshi News home page

కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి

Jul 21 2015 9:20 AM | Updated on Jul 30 2018 8:51 PM

కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి - Sakshi

కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి

ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళపై స్థానిక గ్యాంగ్స్టర్లు పాశవిక లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా క్రురాతిక్రూరంగ హత్య చేశారు.

ఆగ్రా: ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళపై స్థానిక గ్యాంగ్స్టర్లు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అత్యంత క్రూరంగా హత్య చేశారు. మహిళ దేహాన్ని రెండు ముక్కలుగా చీల్చేసి కాల్చిపడేశారు. ఈ ఘటన మాల్పురాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు అదే గ్రామ పెద్ద కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ దారుణ సంఘటన కూడా పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలం వద్ద మహిళ దుస్తులు, అసంపూర్ణంగా కాలిపోయిన ఆమె శరీర భాగాలు లభించాయి. కాగా, ఇప్పటికే ఆ గ్రామ పెద్ద, మరికొందరు కలిసి మృతురాలి భర్తను సంప్రదించి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తమవంతు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కాగా మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో  గ్రామ పెద్దతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement