breaking news
Local goons
-
ఘోరం: నిండు గర్భిణిపై దారుణంగా దాడి: వీడియో వైరల్
నిండు చూలాలుపై కొందరూ గూండాలు ఘోరంగా దాడి చేశారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సందీప్ అనే యువకుడు, అతడి భార్య ఉపాసనపై కొందరూ దుండగులు ఘోరంగా దాడి చేశారు. కొందరూ వ్యక్తులు వచ్చి ఆ యువకుడిని అతడి మామ గురించి ఆరా తీశారు. ఐతే ఆ యువకుడు అతని మామ గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదని వారంతా దుర్భాషలాడటం ప్రారంభించారు. దీన్ని సందీప్ వ్యతిరేకించడంతో అతడిపై దుండగలు దాడి చేయడం ప్రారంభించారు. దాడిని ఆపేందుకు సందీప్ భార్య ఉపాసన ప్రయత్నించగా.. ఆమెపై కూడా దారుణంగా దాడి చేశారు సదరు దుండగులు. దీంతో ఉపాసన స్ప్రుహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత వారి కేకలు విని స్థానికులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఈ మేరకు పోలీసులు నిందితులు రవీంద్ర, మన్మోహన్, మన్మోహన్ కుమారుడు ఆదేశ్లుగా గురించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శైలేంద్ర బాజ్పాయ్ అన్నారు. #UttarPradesh | A video of a pregnant woman being beaten by some local goons surfaced on the internet They mercilessly beat a man and his wife for not giving information about their uncle, police said pic.twitter.com/uK94N59oJu — Hindustan Times (@htTweets) December 17, 2022 (చదవండి: భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..) -
కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి
ఆగ్రా: ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళపై స్థానిక గ్యాంగ్స్టర్లు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అత్యంత క్రూరంగా హత్య చేశారు. మహిళ దేహాన్ని రెండు ముక్కలుగా చీల్చేసి కాల్చిపడేశారు. ఈ ఘటన మాల్పురాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు అదే గ్రామ పెద్ద కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ దారుణ సంఘటన కూడా పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలం వద్ద మహిళ దుస్తులు, అసంపూర్ణంగా కాలిపోయిన ఆమె శరీర భాగాలు లభించాయి. కాగా, ఇప్పటికే ఆ గ్రామ పెద్ద, మరికొందరు కలిసి మృతురాలి భర్తను సంప్రదించి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తమవంతు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కాగా మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గ్రామ పెద్దతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.