
ఇండిగో తగ్గింపు ధరలు ఇవిగో..
రాయితీ టిక్కెట్ల వార్ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.
ముంబై: రాయితీ టిక్కెట్ల వార్ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో తగ్గింపు ధరలను బుధవారం ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లో బుకింక్స్ ఫిబ్రవరి 25 వరకు అందుబాటులోఉండనున్నట్టుతెలపింది. అలాగే ఈ టికెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టెడ్ సెక్టార్‌లో, సెలెక్టెడ్ విమానాలకుమాత్రం ఈ ఆఫర్ పరిమితమని పేర్కొంది.
ఈ తగ్గింపు టికెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర-చండీఘఢ్ మధ్య రూ.777 అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మధ్య రూ. 999గా ఉండనున్నాయి. ప్రయాణానికి 19రోజుల ముందుబుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే పరిమితమైన సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లించనున్నామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు ఇండిగోఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.