సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు | Actor Sanjay Dutt gets another 30-day extension in parole | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు

Jan 20 2014 5:57 PM | Updated on Sep 2 2017 2:49 AM

సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు

సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు

1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో 30 రోజులపాటు పెరోల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది

1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో 30 రోజులపాటు పెరోల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. భార్య మాన్యత అనారోగ్యం పాలుకావడంతో గత డిసెంబర్ 6 తేదిన ఒక నెలపాటు పెరోల్ ను మంజూరు చేసింది.  వాస్తవానికి 30 రోజుల పెరోల్ గడువు మంగళవారంతో పూర్తికానుంది.
 
అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని సంజయ దత్ చేసిన విజ్క్షప్తికి పూణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్ ముఖ్ మరో 30 రోజులపాటు పెరోలు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు విధించిన సంగతి తెలిసిందే. మాన్యత లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement