breaking news
Yerawada Jai
-
వాళ్లను ఉరితీసింది ఇక్కడే!
పూనా ఒప్పందం జరిగింది ఎప్పుడు జరిగింది? 1932లో. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఎవరు? మహాత్మా గాంధీ– బాబా సాహెబ్ అంబేద్కర్. ఆ ఒప్పందం ఎక్కడ జరిగింది? ఇదీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమాచారం. ఆ ఒప్పందం యరవాడ సెంట్రల్ జైల్లో జరిగింది. ఆ రోజున మహాత్మా గాంధీజీ– అంబేద్కర్ ఏ చెట్టు కింద అయితే కూర్చుని ఒప్పందం మీద సంతకం చేశారో... ఆ చెట్టు జైలు ప్రాంగణంలో ఇప్పటికీ ఉంది. అలాగే గాంధీజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి మౌన సాక్షులుగా నిలిచి ఉన్నాయి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మోతీ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ భరత మాత సంకెళ్లు తెంచే యజ్ఞంలో అరెస్టయి ఇదే జైల్లో శిక్షను అనుభవించారు. చాపేకర్ సోదరుల ఉరితీత ఇక్కడే. అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసింది కూడా ఇక్కడే. జైలు... అనగానే నేరగాళ్లు శిక్ష అనుభవించే ప్రదేశంగానే చూస్తున్నాం. నిజానికి యరవాడ జైలు దేశ చరిత్రను అవగతం చేసే ప్రాంగణం. అసలే... ఈ తరం విద్యార్థులకు చరిత్ర పాఠాలు పెద్దగా తలకెక్కడం లేదు. ఇక్కడ పర్యటిస్తే స్వాతంత్య్ర సమరం కళ్లకు కడుతుంది. అందుకే స్కూలు, కాలేజ్ విద్యార్థుల కోసం ‘జైలు పర్యటన’కు తలుపులు తెరిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా జైల్ టూరిజాన్ని ప్రారంభించనుంది. రోజుకు యాభైమందిని మాత్రమే అనుమతిస్తారు. ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జైలు పర్యటనకు వచ్చిన విద్యార్థులకు గైడ్లుగా జైలు సెక్యూరిటి గార్డులు వ్యవహరిస్తారు.(చదవండి: మీ భంగిమలను ఇలా చెక్ చేసుకోండి!) -
సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు
1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో 30 రోజులపాటు పెరోల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. భార్య మాన్యత అనారోగ్యం పాలుకావడంతో గత డిసెంబర్ 6 తేదిన ఒక నెలపాటు పెరోల్ ను మంజూరు చేసింది. వాస్తవానికి 30 రోజుల పెరోల్ గడువు మంగళవారంతో పూర్తికానుంది. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని సంజయ దత్ చేసిన విజ్క్షప్తికి పూణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్ ముఖ్ మరో 30 రోజులపాటు పెరోలు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు విధించిన సంగతి తెలిసిందే. మాన్యత లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.