ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారం | A 25-year-old woman was allegedly gang-raped by five men | Sakshi
Sakshi News home page

ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారం

May 17 2015 8:55 PM | Updated on Apr 4 2019 5:25 PM

ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారం - Sakshi

ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారం

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆటో వెళుతున్న మహిళను మధ్యలో అడ్డగించి తమ కారులోకి బలవంతంగా ఎక్కించుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆటో వెళుతున్న మహిళను మధ్యలో అడ్డగించి తమ కారులోకి బలవంతంగా ఎక్కించుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులందరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాల మేరకు పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కు చెందిన మహిళ దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి ఒక ఆటోలో వెళుతుండగా.. తమ ఆటోను వెంబడించి వచ్చిన ఓ కారు ఒక్కసారిగా అడ్డుకొని అందులో ఉన్న ఐదుగురు బాధితురాలిని, ఆటో డ్రైవర్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం దక్షిణ్ పురి వైపు ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం డిఫెన్స్ కాలనీలో పడేసి వెళ్లారు. బాధితురాలు, ఆటో డ్రైవర్ పోలీసులకు ఈ విషయం చెప్పడంతో నిందితులందరిని కారుడ్రైవర్ తో అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement