బాలికపై లైంగిక దాడి, చిత్రహింసలు | 8-year-old girl raped, stabbed by neighbour in Delhi; admitted to AIIMS | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి, చిత్రహింసలు

Aug 12 2015 4:23 PM | Updated on Jul 28 2018 8:44 PM

బాలికపై లైంగిక దాడి, చిత్రహింసలు - Sakshi

బాలికపై లైంగిక దాడి, చిత్రహింసలు

ఓ కామాంధుడి చేతిలో చిత్రహింసలకు గురైన మరో నిర్భయ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఒక్ల ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం ఎనిమిదేళ్ల పాపను స్కూలు నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు.

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం నడిబొడ్డులో మరో అమానుషం జరిగింది. ఓ కామాంధుడి చేతిలో చిత్రహింసలకు గురైన మరో నిర్భయ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఒక్లా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఎనిమిదేళ్ల పాపను స్కూలు నుంచి తీసుకెళ్లి  లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. అనంతరం చిత్రహింసల పాలు చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన  స్థానికంగా కలకలం  రేపింది.

45 ఏళ్ల వ్యక్తి పథకం ప్రకారం బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు.  బాలిక బంధువునని చెప్పి స్కూలు సిబ్బందిని నమ్మించాడు.  అతను తన పొరుగువాడే కావడంతో బాలిక కూడా అతని వెంట వెళ్లేందుకు ఒప్పుకుంది.  అక్కడి నుంచి  స్కూలు వెనుకనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిపై కత్తితో దాడిచేశాడు. తలపై బండరాయితో మోదాడు.   చనిపోయిందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.  ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్రగాయాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు  సమాచారం.  కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్ననిందితుడి కోసం వెదుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement