కొత్త పెళ్లికూతురిపై నాలుగు నెలలు అత్యాచారం | 65-year-old godman held for raping woman at ashram | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికూతురిపై నాలుగు నెలలు అత్యాచారం

Sep 4 2013 2:16 PM | Updated on Oct 8 2018 3:17 PM

65 ఏళ్ల బాబా ఒకరు 24 ఏళ్ల మహిళను నాలుగు నెలలుగా ఆశ్రమంలోనే బంధించి, ఆమెపై అత్యాచారం చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

మాయలు చేసో, మంత్రాలు చదివో.. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న బాబాలు, స్వాములకు కొదవ లేని దేశం మనది. సరిగ్గా ఇలాగే చేశాడో పెద్ద మనిషి. ఆయన వయసు 65 ఏళ్లు. తనకు తాను బాబాగా చెప్పుకొంటున్నాడు. 24 ఏళ్ల మహిళను నాలుగు నెలలుగా తన ఆశ్రమంలోనే బంధించి, ఆమెపై ఇన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు లీలలు బయట పడిన కొన్నాళ్లకే ఈ విషయం కూడా బయటపడింది.

మహేంద్రగిరి అలియాస్ టున్ను బాబా అనే ఈ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్లోని నీల్ఖండ్ గ్రామంలో అతడి ఆశ్రమంపై దాడులు చేసి, సదరు మహిళను వారు రక్షించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, బాధితురాలి భర్త, అత్త కూడా అదే ఆశ్రమంలో ఉండటమే కాక.. వాళ్లే స్వయంగా ఆమెను టున్ను బాబా వద్దకు పంపేవారట!! ఈ ఘనకార్యానికి పాల్పడినందుకు వారిద్దరినీ కూడా అరెస్టు చేశారు. ఈ సంవత్సరం మే నెలలోనే బాధితురాలికి విశ్రామ్ బంజారా అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమెపై టున్ను బాబా అత్యాచార పర్వం మొదలైంది. దీంతో.. అత్యాచారం, అక్రమ నిర్బంధం, నేరపూరితంగా బెదిరించడం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement