విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
నాతవరం: విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి కారులో గంజాయిని తరలిస్తుండగా నాతవరం మండలం గాంధీనగర్ సమీపంలో పోలీసులు పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వారిలో శక్తిస్వామి వరప్రసాద్, బంజర ప్రసాద్, జి.రాజశేషు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా.