యెమెన్లో ఆత్మహుతి దాడి: 40 మంది మృతి | 40 soldiers killed in Yemen suicide bombings | Sakshi
Sakshi News home page

యెమెన్లో ఆత్మహుతి దాడి: 40 మంది మృతి

Sep 20 2013 2:16 PM | Updated on Sep 1 2017 10:53 PM

యెమెన్లోని షబ్బవా ప్రావెన్లో సైనికులు అత్యధికంగా నివసించే ప్రాంతంలోని ఈ రోజు తెల్లవారుజామున ఆత్మాహుతి జరిపిన దాడిలో 40 మంది సైనికులు మరణించారు.

యెమెన్ దేశంలో ఆగ్నేయ ప్రాంతంలోని షబ్బవా ప్రావెన్లో సైనికులు అత్యధికంగా నివసించే ప్రాంతంలోని ఈ రోజు తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. దాదాపు వంద మంది వరకు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు.

 

వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అజ్జన్ ప్రాంతంలో ఆత్మాహుతి జరిపిన కారు బాంబు ఘటనలో 30 మంది సైనికులు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన రెండు కారు బాంబు పేలుళ్లలో 10 మంది సైనికులు మృతి చెందారని, పలువురు సైనికులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వివరించారు. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement