బస్సు లోయలో పడి 27 మంది మృతి చెందిన ఘటన థాయ్లాండ్లోని టక్ ప్రావెన్స్లో గత రాత్రి చోటు చేసుకుంది.
బస్సు లోయలో పడి 27 మంది మృతి చెందిన ఘటన థాయ్లాండ్లోని టక్ ప్రావెన్స్లో గత రాత్రి చోటు చేసుకుంది. మరో 24 మంది గాయపడ్డారు. బస్సు బ్రేక్స్ ఫెయిల్ కారణంగా ఆ ప్రమాదం సంభవించిందని స్థానిక మీడియా మంగళవారం ఇక్కడ వెల్లడించింది. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని పేర్కొంది. గాయపడిన ప్రయాణికులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని మీడియా వివరించింది.