రేణిగుంటలో ఎర్రచందనం స్మగ్లింగ్‌, 25మంది అరెస్ట్ | 25 Redwood smugglers arrested in Chittoor district | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో ఎర్రచందనం స్మగ్లింగ్‌, 25మంది అరెస్ట్

Dec 13 2013 7:57 PM | Updated on Oct 4 2018 6:03 PM

తిరుపతిలోని రేణిగుంట చైతన్యపురంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అప్రమత్తమైయ్యారు.

తిరుపతి: అటవీ ప్రాంతంలో పుష్కలంగా లభించే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరాటంకంగా సాగుతుంది. తిరుపతిలోని రేణిగుంట చైతన్యపురంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అప్రమత్తమైయ్యారు. అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 25మంది స్మగ్లర్లను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.

 

వారినుంచి 25లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అటవీ అధికారులు పేర్కొన్నారు.  అయితే ఇటీవలి కాలంలో తరచూ ఎర్రచందనం పట్టుపడుతూనే ఉన్నా బడా స్మగ్లర్లు మాత్రం దొరక్కపోవడం లేదు. అయినా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో అటు పోలీసులు, ఇటు అటవీ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement