వేర్వేరు ప్రమాదాలు : 20 మంది మృతి | 20 people killed in Bangladesh accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాలు : 20 మంది మృతి

Jul 19 2015 11:09 AM | Updated on Apr 3 2019 7:53 PM

బంగ్లాదేశ్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు.

ఢాకా : బంగ్లాదేశ్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. సిరాజ్గంజ్ జిల్లాలో జమునా నది బ్రిడ్జ్పై శనివారం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.  అలాగే శుక్రవారం రాత్రి భారీ వర్షాల కారణంగా చిట్టిగాంగ్లో మట్టి చరియలు పడి మూడు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురు మరణించారని పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement