రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి | 19 killed in traffic accident in northern Sudan | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి

Aug 10 2015 8:30 AM | Updated on Apr 3 2019 7:53 PM

సూడాన్ ఉమ్ అల్ హసన్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఖార్టూమ్ : సూడాన్ ఉమ్ అల్ హసన్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న  రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది.

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రమాదం జరిగిన ప్రదేశం సుడాన్ రాజధాని ఖార్టూమ్కు 240 కిలోమీటర్ల దూరంలో ఉందని మీడియా చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement