పాక్‌ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు! | 15 arrested in Burhanpur for raising Pro-Pak slogans | Sakshi
Sakshi News home page

పాక్‌ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు!

Jun 20 2017 2:44 PM | Updated on Sep 5 2017 2:04 PM

పాక్‌ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు!

పాక్‌ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు!

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ జట్టుపై పాకిస్థాన్‌ విజయం సాధించడంతో కొందరు అత్యుత్సాహంతో దాయాది పట్ల ప్రేమతో సంబరాలు జరిపి..

భోపాల్‌: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ జట్టుపై పాకిస్థాన్‌ విజయం సాధించడంతో కొందరు అత్యుత్సాహంతో దాయాది పట్ల ప్రేమతో సంబరాలు జరిపి.. అడ్డంగా బుక్కయ్యారు. ఫైనల్‌లో పాక్‌ విజయంతో పటాకులు కాల్చి.. పాక్‌ అనుకూల నినాదాలు చేసి కలకలం రేపిన 15మందిని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

గత ఆదివారం రాత్రి పాక్‌ విజయం సాధించిన వెంటనే బుర్హాన్‌పూర్‌లో పలువురు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చారు. పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో 15మందిని అరెస్టు చేశామని, సెక్షన్‌ 120బీ, 124ఏ కింద వారిని అదుపులోకి తీసుకున్నామని షాపూర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జి సంజయ్‌ పాఠక్‌ తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా విపరీత చర్యలకు పాల్పడే వారిని సెక్షన్‌ 124ఏ కింద అరెస్టు చేసే అధికారం ఉందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement