అమ్మాయిలపై వేధింపుల షాకింగ్‌ వీడియో! | 14 Men Molest 2 Women in UP | Sakshi
Sakshi News home page

అమ్మాయిలపై వేధింపుల షాకింగ్‌ వీడియో!

May 28 2017 3:39 PM | Updated on Sep 5 2017 12:13 PM

అమ్మాయిలపై వేధింపుల షాకింగ్‌ వీడియో!

అమ్మాయిలపై వేధింపుల షాకింగ్‌ వీడియో!

ఇద్దరు అమ్మయిలను 14 మంది ఆకతాయిలు అత్యంత కిరాతకంగా లైంగికంగా వేధించిన షాకింగ్‌ వీడియో

రాంపూర్‌: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో ఇద్దరు అమ్మయిలను 14 మంది ఆకతాయిలు అత్యంత కిరాతకంగా లైంగికంగా వేధించిన షాకింగ్‌ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు అమ్మాయిలను ఆకతాయిలు లైంగికంగా వేధించి.. అసభ్యంగా తాకుతూ, తిడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈ ఘటనను తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రాంపూర్‌ జిల్లా తాండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

కేసు నమోదు చేసి.. ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు చేపడుతున్నారు. ఆకతాయిల చేతిలో వేధింపులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులను సైతం గుర్తించారు. చుట్టూ చెట్లు ఉన్న పరిసరాల్లో బైకుల వచ్చినట్టు కనిపించిన ఆకతాయిల ఇద్దరు అమ్మాయిలపైనే చెలరేగిపోయారు. అత్యంత దుర్మార్గంగా ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించారు. వారిని అసభ్యంగా తాకుతు, తోసేస్తూ, తిడుతూ కనిపించారు. నిస్సహాయస్థితిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కేకలు పెడుతూ, తమను విడిచిపెట్టాలని దీనంగా అర్థించారు. అయినా ఆ కిరాతకులు పట్టించుకోకుండా వారిని లైంగికంగా వేధించి.. తమలోని క్రూరత్వాన్ని చాటుకున్నారు.
 
యూపీలో భారీ మెజారిటీతో బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నేరాలు అమాంతం పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణిస్తుండటంతో ప్రతిపక్షాలు అదేపనిగా యోగి సర్కారుపై మండిపడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement