స్కూల్లో ప్రిన్సిపాల్‌, టీచర్ల లైంగికదాడి | 12-Year-Old Allegedly Gang-Raped By Principal, 3 Teachers | Sakshi
Sakshi News home page

స్కూల్లో ప్రిన్సిపాల్‌, టీచర్ల లైంగికదాడి

Jan 17 2017 2:21 PM | Updated on Jul 18 2019 2:02 PM

స్కూల్లో ప్రిన్సిపాల్‌, టీచర్ల లైంగికదాడి - Sakshi

స్కూల్లో ప్రిన్సిపాల్‌, టీచర్ల లైంగికదాడి

జెహనాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌, ముగ్గురు టీచర్లు కలసి 12 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.

జెహనాబాద్‌: బిహార్‌లో దారుణం జరిగింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే మృగాళ్లా ప్రవర్తించారు. జెహనాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌, ముగ్గురు టీచర్లు కలసి 12 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి చేశారు.

కకో ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన‍్సిపాల్‌ అజు అహ్మద్‌, టీచర్లు అతుల్‌ రెహ్మాన్‌, అబ్దుల్‌ బరీ, మహ్మద్‌ షౌకత్‌.. సోమవారం బాధిత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత బాలిక చింపిరి జట్టుతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండటాన్ని ఆమె తల్లి, ఓ ఉపాధ్యాయుడు గమనించారు. బాధితురాలి తల్లి ఆరా తీయగా, ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement