
క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న వెంకటేష్
అంబర్‌పేట: పోలీస్ అనగానే తనకు ‘ఘర్షణ’ సినిమాలో డీసీపీ రాంచందర్ పాత్ర గుర్తుకు వస్తుందని సినీనటుడు వెంకటేష్ అన్నారు. నగర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీస్‌లో భాగంగా మొహల్లా క్రికెట్ లీగ్–2019 పేరిట చేపట్టిన ఈస్ట్‌జోన్, నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం అంబర్‌పేట పోలీస్ శిక్షణ కేంద్రం మైదానంలో నగర అడిషనల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) డి.ఎస్ చౌహాన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ విజేత టీమ్‌కు తన వంతుగా రూ.లక్ష బహుమతి అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్, ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ గోవింద్‌రెడ్డి, నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన, కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఇన్‌స్పెక్టర్‌లు ఏపీ ఆనంద్‌కుమార్, పీజీ రెడ్డి, యాదగిరి రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కళాకారిణి సాయిప్రియ నృత్యం అలరించింది.