కెరీర్‌లో మరిచిపోలేని విజయం... | Yuki Bhambri Registers Biggest Win In Career | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో మరిచిపోలేని విజయం...

Mar 12 2018 8:15 PM | Updated on Mar 12 2018 8:58 PM

Yuki Bhambri Registers Biggest Win In Career - Sakshi

కాలిఫోర్నియా : ప్రముఖ భారత టెన్నిస్‌ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్‌లోనే మరిచిపోలేని అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ 12 ఫ్రెంచ్‌ క్రీడాకారుడు లూకాస్ పౌల్లెను ఓడించి చరిత్ర సృష్టించాడు. 110వ ర్యాంక్‌లో ఉన్న యూకీ ఈ విజయంతో టెన్నిస్‌ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు. సోమవారం జరిగిన ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సెకండ్‌ రౌండ్‌లో 6-4, 6-4 తేడాతో లూకాస్ పౌల్లెపై విజయ దుందుభి మోగించాడు.

ఈ విజయంతో బాంబ్రీకి 40 ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు 47 వేల డాలర్ల నజరానా లభించనుంది. మూడో రౌండ్‌లో అమెరికాకు చెందిన పొడగరి, ప్రపంచ 21 ర్యాంకర్‌ శామ్‌ క్వెర్రితో బాంబ్రీ తలపడనున్నాడు. 2017లో జరిగిన సిటీ ఓపెన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ షిప్‌లో ప్రపంచ 22 ర్యాంకర్‌ గేల్‌ మాన్‌లిస్‌ను ఓడించి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన చెన్నై ఓపెన్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ ఫాబియో ఫోగ్నిని ఓడించి సత్తా చాటాడు. 

Advertisement
 
Advertisement
Advertisement