ధనిక రాష్ట్రంలో పేదలపై చార్జీల మోతా? | ysrcp state Secretary fired on trs government | Sakshi
Sakshi News home page

ధనిక రాష్ట్రంలో పేదలపై చార్జీల మోతా?

Jun 28 2016 8:09 AM | Updated on May 25 2018 9:20 PM

ధనిక రాష్ట్రంలో పేదలపై చార్జీల మోతా? - Sakshi

ధనిక రాష్ట్రంలో పేదలపై చార్జీల మోతా?

ధనిక రాష్ర్టంలో ఆర్టీసీ బస్సు, విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపుతారా? అని వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు ప్రశ్నించారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బి.సంజీవరావు

జోగిపేట : ధనిక రాష్ర్టంలో ఆర్టీసీ బస్సు, విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపుతారా? అని వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు ప్రశ్నించారు. సోమవారం జోగిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ ప్రజలపై చార్జీల మోత సరికాదన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శించి ప్రస్తుతం విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు.

మిగులు బడ్జెట్‌తో ఎ మ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా? అని ప్ర శ్నించారు. ఆర్టీసీ నష్టాన్ని పూడ్చేం దుకు ఎన్నో మార్గాలున్నప్పటికీ ప్రజ లపై భారం మోపి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాని కి 9 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించా రు. పంట లు నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయడంలో ప్రభుత్వం కాలయాపన చే స్తోందన్నారు.

నష్టపోయిన రైతుల జాబితాను అధికారులు ఏడాది క్రితమే ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపినా ఇప్పటి వరకు ఒక్క రూ పాయి కూడా పంపిణీ చేయలేదన్నారు. రైతు రుణమాఫీని బ్యాంకర్లు వడ్డీ కిందనే జమ చేసుకుంటారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు రుణమాఫీ అమలు కావడంలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ని యోజకవర్గంలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు  నిర్మించి ఇవ్వలేదన్నారు. వైఎస్సా ర్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు డీజీమల్లయ్య యాదవ్, వైఎస్సార్ సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్, నాయకులు ఆశయ్య, పరిపూర్ణ ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement