ఖమ్మం జిల్లాలో 'ఫ్యాన్' పాగా | YSRCP gains in Khammam District | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో 'ఫ్యాన్' పాగా

May 16 2014 11:21 PM | Updated on Aug 14 2018 4:24 PM

కామ్రేడుల ఖిల్లా ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్ఆర్ సీపీ సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయపతాకం ఎగురవేసింది.

కామ్రేడుల ఖిల్లా ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్ఆర్ సీపీ సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయపతాకం ఎగురవేసింది. 108 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీలు గెల్చుకుని ఊపుమీదున్న వైఎస్ఆర్ సీపీ ఫైనల్స్లోనూ హవా కొనసాగించింది. 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 4, వైఎస్ఆర్ సీపీ 3, సీపీఎం, టీఆర్ఎస్, టీడీపీ ఒక్కోస్థానాన్ని గెల్చుకున్నాయి.

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పోరులో 'ఫ్యాన్' ప్రభంజనం సృష్టించింది. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. సీపీఐ కార్యదర్శి కె. నారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఇక అసెంబ్లీ స్థానాలను చూసుకుంటే...
1. పినపాకలో వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్పై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు 14048 ఓట్లతో గెలుపొందారు. టి.రమేష్(కాంగ్రెస్), చందా లింగయ్య దొర(బీజేపీ), కణితి కృష్ణ (జై సమైక్యాంధ్ర) ఇక్కడి నుంచి పోటీ చేశారు.

2. వైరా (ఎస్టీ)లో వైఎస్ఆర్ సీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి బానోతు బాలజీపై 11056 ఓట్లతో వైఎస్ఆర్ సీపీ బానోతు మదన్లాల్ గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి చంద్రావతి, సీపీఐ నుంచి ఎం.నారాయణ, సీపీఎం తరపున బి.వీరభద్రం, జై సమైక్యాంధ్ర తరపున వాసం రామకృష్ణదొర పోటీ చేశారు.

3. అశ్వరావుపేట (ఎస్టీ)లో వైఎస్ఆర్ సీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి ఎం.నాగేశ్వరరావుపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు... ఓట్లతో విజయం సాధించారు. జె. ఆదినారాయణ(టీఆర్ఎస్), వి.మిత్రసేన(కాంగ్రెస్), పాయం పోతయ్య దొర (జై సమైక్యాంధ్ర) ఇక్కడ పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు.

4. ఇల్లెందు (ఎస్టీ)లో కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి హరిప్రియ నాయక్పై కాంగ్రెస్ అభ్యర్థి కొర్రం కనకయ్య 11286 ఓట్లతో గెలిచారు. జి.రవిబాబు(వైఎస్ఆర్ సీపీ), ఊకె అబ్బయ్య(టీఆర్ఎస్), మోడే హనుమా (ఆమ్ఆద్మీ), ముక్తిరాజు (జై సమైక్యాంధ్ర) ఇక్కడ బరిలో ఉన్నారు.

5. పాలేరులోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. వెంకటరెడ్డి గెలిచారు. సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి స్వర్ణకుమారిపై .... ఓట్లతో నెగ్గారు. రవీందర్రావు(టీఆర్ఎస్), కాసాని శ్రీనివాస్ (ఆమ్ఆద్మీ), అప్పల లింగమూర్తి (జై సమైక్యాంధ్ర) ఇక్కడ పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు.

6. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి లింగల కమల్‌రాజుపై.... ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఆర్ఎస్ తరపున బొమ్మెర  రామ్మూర్తి, టీడీపీ తరపున మోత్కుపల్లి నర్సింహులు, జై సమైక్యాంధ్ర నుంచి మల్లు శివరాం పోటీ చేశారు.

7. ఖమ్మం సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్.... ఓట్లతో ఓడించారు.      కె.నాగభూషణం(వైఎస్ఆర్ సీపీ), జి. కృష్ణ(టీఆర్ఎస్), యర్రా శ్రీకాంత్(సీపీఎం), మహ్మద్ అసద్ (ఆమ్ఆద్మీ), షేక్ పాషా (జై సమైక్యాంధ్ర) ఇక్కడ బరిలో ఉన్నారు.

8. కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై 16521 ఓట్లతో గెలుపొందారు.సీపీఐ నుంచి కె.సాంబశివరావు విజయం సాధించారు. టీడీపీ నుంచి కోనేరు సత్యనారాయణ, జై సమైక్యాంధ్ర తరపున నార్ల సత్యనారాయణ పోటీ చేశారు.

9. సత్తుపల్లి (ఎస్సీ)లో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. వైఎస్సార్ సీపీ మట్టా దయానంద్ విజయ్ కుమార్ను.... ఓట్లతో ఓడించారు. టీఆర్ఎస్ నుంచి పిడమర్తి రవి, కాంగ్రెస్ నుంచి సంభాని చంద్రశేఖర్, జై సమైక్యాంధ్ర నుంచి తమ్మల రాజేష్‌కుమార్ బరిలో నిలిచారు.

10. భద్రాచలం స్థానాన్ని సీపీఎం గెల్చుకుంది. టీడీపీ అభ్యర్థి ఫణీశ్వరమ్మపై సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య 1815 ఓట్లతో నెగ్గారు.  టీఆర్ఎస్ తరపున ఝాన్సీరాణి ఆనందరావు, కాంగ్రెస్ తరపున కుంజా సత్యవతి, జై సమైక్యాంధ్ర తరపున కురుసం సుబ్బారావు పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement