వైఎస్సార్ మరణం దురదృష్టకరం: దిగ్విజయ్ | YS Rajasekhara Reddy Death Unfortunate, says Digvijay Singh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ మరణం దురదృష్టకరం: దిగ్విజయ్

Aug 24 2014 12:07 PM | Updated on Aug 14 2018 3:55 PM

వైఎస్సార్ మరణం దురదృష్టకరం: దిగ్విజయ్ - Sakshi

వైఎస్సార్ మరణం దురదృష్టకరం: దిగ్విజయ్

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం మరువలేనిదని దిగ్విజయ్‌ సింగ్ అన్నారు.

ఇబ్రహీంపట్నం: అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్‌ సింగ్ అన్నారు. కాంగ్రెస్, సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లలేకపోయామని తెలంగాణ కాంగ్రెస్ సదస్సులో పేర్కొన్నారు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగినమాట నిజమేనని, సీమాంధ్రలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని వాపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం మరువలేనిదన్నారు. ఆయన వల్లే  2004-09 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, యూపీఏ రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం దురదృష్టకరమని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement