రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | youth died in a road accident in suryapet didtrict | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Jan 12 2017 9:20 AM | Updated on Sep 18 2019 3:24 PM

గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

గరిడేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్‌(19) బైక్‌పై గరిడేపల్లి వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలైన రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement