బైక్‌ పై నుంచి పడి యువకుడు మృతి | youngster dies after falldown from bike in nizambad | Sakshi
Sakshi News home page

బైక్‌ పై నుంచి పడి యువకుడు మృతి

Jun 14 2015 11:30 AM | Updated on Jul 11 2019 8:56 PM

వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఒక యువకుడు మృతి చెందాడు.

నిజామాబాద్: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం గుర్గుల్ గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. పోసానిపేట గ్రామానికి చెందిన పిట్ల రాజు(22) అనే యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గర్గుల్ గ్రామ సమీపానికి చేరుకొగానే బైక్ అదుపుతప్పి కిందపడింది. దీంతో రాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement