రియాక్టర్‌ పేలుడు: యువకుడు మృతి | young man died in reactor blast at Reddy's Lab's | Sakshi
Sakshi News home page

రియాక్టర్‌ పేలుడు: యువకుడు మృతి

Aug 1 2017 1:00 PM | Updated on Sep 11 2017 11:01 PM

రెడ్డి ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు.

కొమురవెల్లి:  హైదరాబాద్‌లోని రెడ్డి ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ వద్ద మహేష్‌, మరో ఇద్దరు సోమవారం రాత్రి పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడితో రియాక్టర్‌ పేలింది. దీంతో అతని ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడగా.. ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మహేష్‌ కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement