విద్యుత్ షాక్‌తో యువతి మృతి | young girl dies of electric shock in nagole | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో యువతి మృతి

Nov 4 2015 7:59 PM | Updated on Apr 3 2019 8:07 PM

విద్యుత్ షాక్‌కు గురై ఓ యువతి మృతి చెందింది.

నాగోలు: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో ఆ యువతిని కాపాడబోయిన మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మపల్లికి చెందిన నైనిషా (23) ఎల్‌బీనగర్ శివగంగకాలనీలో మేనమామ నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో దుస్తులు ఉతికి బాల్కనీలోని జీఐ వైరుపై ఆరవేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది.

వెంటనే కింద నుంచి పైకి వచ్చిన గీతావాణి విద్యుత్ షాక్‌కు గురైన నైనిషాను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా షాక్‌కు గురైంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. నైనిషా చికత్స పొందుతూ మృతి చెందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement