బాలికపై యువకుడి అత్యాచారం | Young Boy Attempt To Molested On 9th Class Girl At Tandoor | Sakshi
Sakshi News home page

బాలికపై యువకుడి అత్యాచారం

Dec 17 2019 5:23 AM | Updated on Dec 17 2019 7:31 AM

Young Boy Attempt To Molested On 9th Class Girl At Tandoor - Sakshi

తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్‌కు చెందిన యువకుడు పవన్‌ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్‌ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్‌ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement