పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి | young boy attacked to degree student on marriage praposal | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి

Nov 22 2016 3:27 AM | Updated on Jul 30 2018 8:37 PM

పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి - Sakshi

పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి

పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో ఆమెపై దాడి చేయడంతో నడుం, మోచేతికి గాయాలయ్యారుు.

ఆదిలాబాద్ క్రై ం: పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో ఆమెపై దాడి చేయడంతో నడుం, మోచేతికి గాయాలయ్యారుు. ఈ ఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. జైనథ్ మండలం మాండగాడ గ్రామానికి చెందిన సిడాం నందిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేల మండలం బెల్గాం గ్రామానికి చెందిన గెడాం నందుతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్లి ఇష్టం లేదని నందిని తల్లిదండ్రులకు చెప్పడంతో మూడు రోజులకే ఇరువురి పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో నందు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నందిని కళాశాల వద్ద సోమవారం నందు మాటు వేసి కత్తితో దాడిచేశాడు. మోచేరుు, నడుంపై గాట్లు పడడంతో ఆమె కేకలు వేసింది.  పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement