పసుపు పొత్తు..కమలం చిత్తు

పసుపు పొత్తు..కమలం చిత్తు - Sakshi

 • జిల్లాలో బీజేపీకి దారుణ ఫలితాలు

 • డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు.. రెండు స్థానాల్లో లాభపడ్డ టీడీపీ

 • అయోమయంలో కమలనాథులు

 •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీని నిండా ముంచింది. తెలంగాణ వ్యతిరేకత వైఖరితో ఉన్న టీడీపీతో పొత్తు వల్ల ఉద్యమ ఫలితాలు కమలదళానికి ఏ మాత్రం దక్కలేదు. బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినా... ఉన్నత స్థాయిలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తీసుకున్న నిర్ణయం కాషాయ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నరేంద్రమోడీ హవాతో దేశవ్యాప్తంగా ఏకపక్షంగా వచ్చిన ఫలితాలకు జిల్లాలోని ఫలితాలకు ఎక్కడా పొంతన లేకుండాపోయింది.  బీజేపీ అనుకూల పవనాల్లో కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసిన అ భ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా పోయూరుు. టీడీపీ తో పొత్తు వల్లే బీజేపీకి జిల్లాలో ఇలాంటి దుస్థితి వచ్చిందని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలను చిత్తుచేసిన పరిస్థితుల్లోనే జిల్లాలో దారుణ పరాజయం వస్తే... కోలుకునేది ఎలా అని ఆందోళన పడుతున్నారు. టీడీపీతో పొత్తుతో తాము నష్టపోగా.. ఇదే సమయంలో తమతో కలవడం తో టీడీపీ లాభపడిందని బీజేపీ నేతలు అంటున్నారు. పరకాలలో టీడీపీ విజయం దక్కడం బీజేపీ సహకారంతోనే జరిగిందంటున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలను పరిశీలించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.   టీడీపీ మాత్రం లాభపడింది...  బీజేపీతో పొత్తుతో టీడీపీ మాత్రం జిల్లాలో లాభపడిం ది. పరకాల నియోజకవర్గంలో బీజేపీకి మొదటి నుంచి గణనీయ సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది. ఈ పార్టీ ఇక్కడ గతంలో పలుసార్లు గెలిచిన సందర్భాలు ఉన్నా యి. తాజా ఎన్నికల్లో ఈ సీటు టీడీపీకి ఇవ్వడంతో బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించింది. పరకాల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ విజయచందర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ధర్మారెడ్డితో కలిసి ప్రచారం చేశారు.  అన్ని స్థాయిల్లో బీజేపీ శ్రేణుల సహకారంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధిం చారని కమలం పార్టీ నేతలు అంటున్నారు. పాలకుర్తిలో బీజేపీకి ఉన్న స్వల్ప ఓటు బ్యాంకుతోనే అక్కడ టీడీపీ అభ్యర్థి దయాకర్‌రావు గెలిచారని, ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లు తమ పార్టీవేనని చెబుతున్నా రు. తమకు ఓటు బ్యాంకు లేని నియోజకవర్గాల్లో టీడీ పీ ఓడిపోయిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.  జిల్లాలో 12 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలుండగా... బీజేపీ జనగామ, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి అసెంబ్లీ, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. జనగామ అసెంబీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానంలోనూ బరిలో దిగింది. వర్ధన్నపేట మినహా అన్ని మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అనుకూల పరిస్థితు లు వచ్చాయి.  టీడీపీతో పొత్తు వల్ల ఇది మారిపోయిం ది. టీడీపీ సహకారం లేకపోవడంతో ఈ రెండు స్థానా ల్లో బీజేపీ అభ్యర్థులు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలోనూ బీజేపీ సంప్రదాయ ఓట్లే ఈ పార్టీ అభ్యర్థులకు రాగా, టీడీపీ నుంచి ఏ మా త్రం ఓట్లు రాలేదు. గతంలో బీజేపీ ప్రాతినిథ్యం వహించిన వరంగల్ పశ్చిమలో ఈ పార్టీ అభ్యర్థి ఎం.ధర్మారావుకు కేవలం 18,584 ఓట్లు మాత్రమే వచ్చాయి. వరంగల్ తూర్పులో 11,639 ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థికి పోలయ్యాయి.  జనగామలో బీజేపీ కంటే టీడీపీకి సంప్రదాయంగా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపిన బీ జేపీ, టీడీపీ పొత్తుతో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిం ది. గత ఎన్నికల గణాంకాలతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నే పోటీ ఉంటుందని కమలనాథులు అంచనా వేశారు. టీఆర్‌ఎస్ అనుకూల పవనాలకు తోడు టీడీపీ సహకారం లేకపోవడంతో ఇక్కడి బీజేపీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 21,113 ఓట్లే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.  ఇక పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినట్లుగా చేసి టీడీపీ నేతను బరిలో దించిన భూపాలపల్లిలో మాత్రం టీడీపీ శ్రేణులు బాగానే సహకరించి నట్లు స్పష్టమవుతోంది. నామినేషన్ల తుదిగడువు వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, 57,530ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ కంటే 360 ఓట్లు తక్కువ వచ్చాయి.

   

  లోక్‌సభ స్థానాల్లో..

   

  దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కని పిం చింది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకీ గణనీయ సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఇక్కడ పార్టీ ఎంపీ ప్రాతినిథ్యం వహించారు. నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా ఉన్న అనుకూల పరిస్థితి ఉన్న నే పథ్యంలో ఈ స్థానంలో బీజేపీ ప్రధాన పోటీలో ఉండా లి. కానీ... ఇది జరగలేదు. బీజేపీ అభ్యర్థి రామగల్ల పరమేశ్వర్‌కు ఇక్కడ 1,87,139 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ బీజేపీ ఓట్లు మాత్రమేనని, టీడీపీ వారు సహకరించలేదని కమలనాథులు చెబుతున్నారు.

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top