అత్తింటి వేధింపులకు మహిళ బలి | women suicide in mahabub nagar distirict | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులకు మహిళ బలి

Mar 5 2015 8:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

మహబూబ్ నగర్: భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన మోర శివతో, బొమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన శివలీల(26)కు 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం భర్తతో పాటు ఇతర కుటంబ సభ్యులు వేధిస్తూ ఉండేవారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివలీల బుధవారం అర్ధరాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. గమనించిన స్థానికులు మంటలు అర్పారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయింది. బాధితురాలిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(అచ్చంపేట రూరల్)
 

Advertisement
 
Advertisement
Advertisement