మద్య నిషేధం కోరుతూ మహిళల ర్యాలీ | Women protest liquor sale | Sakshi
Sakshi News home page

మద్య నిషేధం కోరుతూ మహిళల ర్యాలీ

Aug 15 2015 4:55 PM | Updated on Sep 3 2017 7:30 AM

మద్య నిషేధం కోరుతూ మహిళల ర్యాలీ

మద్య నిషేధం కోరుతూ మహిళల ర్యాలీ

మద్యపాన నిషేధం కోరుతూ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామ మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

వాంకిడి (ఆదిలాబాద్): మద్యపాన నిషేధం కోరుతూ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబార గ్రామ మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం గ్రామంలోని మహిళలంతా మహిళా సమాఖ్య జీఆర్పీ సునీత ఆధ్వర్యంలో ఏకమై ఈ కార్యక్రమం తలపెట్టారు.

మద్యానికి బానిసలైన పురుషులు కుటుంబాలను పట్టించుకోవటం మానేశారని ఆరోపించారు. గ్రామంలోని బెల్టుషాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement