రెండు ఉద్యోగాలు సాధించిన నెమ్మికల్‌ వాసి

A Women Got Two Government Jobs At A Time - Sakshi

ఆత్మకూర్‌ (ఎస్‌) : మండల పరిధిలోని నెమ్మికల్‌ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి తన సత్తాచాటింది. గ్రామానికి చెందిన జటంగి సువర్ణ ఎంఎస్‌సీ, బీఈడీ చేసింది. అయితే గత ఏడాది జరిగిన గురుకుల సైన్స్‌ టీచర్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. అయితే ఆమె రాసిన రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం గమనార్హం. ఈమె 1నుంచి 12వ తరగతి వరకు నెమ్మికల్‌లో, డిగ్రీ సూర్యాపేటలో, ఎంఎస్‌సీ, బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది. గ్రామానికి చెందిన సువర్ణ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top