పాపం.. పసివాళ్లు.. | woman suicide in mahaboobnagar district | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాళ్లు..

Feb 4 2015 5:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన గంట తిప్పమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేత సంబంధం కొనసాగిస్తోంది.

మక్తల్: మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన గంట తిప్పమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేత సంబంధం కొనసాగిస్తోంది. తన బంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి.. గతేడాది మార్చిలో పథకం ప్రకారం భర్త సోమన్నను హత్యచేయించింది. ఎవరికీ ఆనవాళ్లు లభించకుండా ఓ పాడుబావిలో శవాన్ని పడేసింది. తన భర్త కనిపించడం లేదని.. ఎక్కడో వెళ్లిపోయాడని గ్రామస్తులను నమ్మించింది. తిరిగి ఐదునెలల తర్వాత సోమన్న చనిపోయాడని తెలిసి.. పోలీసులు విచారణ జరిపి తిప్పమ్మను నిందితురాలుగా చేర్చడంతో కటకటాల పాలైంది.

ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన ఆమెకు పిల్లల పెంపకం భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తిచెంది మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులు లావణ్య(10), శేఖర్(08), జ్యోతి(6), సోని(4), శోభ(3).. తల్లి కూడా మృతిచెందడంతో దిక్కులేని వారయ్యారు. ఆ చిన్నారులంతా పసిమొగ్గలే.. పట్టుమని పదేళ్లు కూడా దాటకపోవడంతో వారి ఆలనాపాలనా చూసుకునేవారు కరువైపోయారు. ప్రస్తుతం ఆ చిన్నారులంతా చిన్నాన్న గాలెప్ప వద్ద ఉంటున్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement