మహిళ దారుణ హత్య | woman murdered in ranga reddy district | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Feb 3 2016 6:07 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు.

వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. మొయినాబాద్ మండలం వెల్చాల గ్రామానికి చెందిన చిన్నమ్మ(42) అనే మహిళ భర్తతో విడిపోయి పదేళ్లుగా వికారాబాద్ మండలం గంగారాం కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి.

మంగళవారం రాత్రి చిన్నమ్మను గుర్తుతెలియని వ్యక్తులు గొంతునులిమి హత్యచేశారు. బుధవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలిపారు. చిన్నమ్మ కుమార్తె సునీత ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement