వివాహిత దారుణ హత్య | woman murdered in nizamabad district | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Dec 24 2015 6:57 PM | Updated on Sep 3 2017 2:31 PM

నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భీమ్‌గల్ మండలం మెండోరా శివారులోని ఈర్లగుట్ట వద్ద దుండగులు గొంతుకోసి మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చారు.

మృతురాలు కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామానికి చెందిన లలిత(35)గా పోలీసులు గుర్తించారు. లలిత గత నెల 12 వ తేదీ నుంచి కనపడటం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ రమణారెడ్డి పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement