ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య

Published Tue, Sep 29 2015 5:08 PM

ఇల్లు మారలేదని ఇల్లాలు ఆత్మహత్య - Sakshi

చిక్కడపల్లి (హైదరాబాద్‌) : ఇల్లు మారదామంటే భర్త ఒప్పుకోలేదనే మనస్తాపంతో నాలుగు నెలల పసిపాపతో సహా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్‌లో మంగళవారం జరిగింది. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న సాయికుమార్ భార్య శ్వేత(26) పుట్టింటి నుంచి సోమవారమే భర్త వద్దకు వచ్చింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉంటే ఒంటరిగా అనిపిస్తుందని వేరే ఇల్లు మారదామని భర్తను అడిగింది.

అయితే అందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె నాలుగు నెలల పసిపాప ఐశ్వర్యపైనా, తనపైనా కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. సంఘటనా స్థలంలోనే తల్లీబిడ్డా చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement