నీళ్ల గొడవ.. కొరుక్కున్న మహిళలు | woman bites another woman at water tanker | Sakshi
Sakshi News home page

నీళ్ల గొడవ.. కొరుక్కున్న మహిళలు

Apr 11 2015 5:08 PM | Updated on Sep 3 2017 12:10 AM

నీళ్ల గొడవ.. కొరుక్కున్న మహిళలు

నీళ్ల గొడవ.. కొరుక్కున్న మహిళలు

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నీటి కోసం మహిళలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.

కుత్బుల్లాపూర్ : వేసవి కావడంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నీటి కోసం మహిళలు ఒకరినొకరు కొట్టుకునే  పరిస్థితి కనిపిస్తోంది. నీటి ట్యాంకర్ కనిపిస్తే చాలు.. అది తమ బస్తీకి వచ్చిందంటే తమ బస్తీకి వచ్చిందంటూ అక్కడివారు ఘర్షణ పడుతున్నారు.

 

శనివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ బాలయ్యనగర్‌లో ట్యాంకర్ వద్ద దేవాబాయి అనే మహిళ ఎక్కువ సమయం నీటిని పట్టుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన పార్వతి ఆగ్రహంతో దేవాబాయి చేతిని గట్టిగా కొరికింది. దీంతో ఆమె చేతికి తీవ్రమైన గాయమైంది. ఈ ఘటనతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఈ నీటి పంచాయతీ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ చేసి పంపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement