
బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్ రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓటర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో, నడిరోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంకర్ వర్తూర్ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాలను ఓటర్ టేక్ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్ వాహనం అదుపు తప్పింది. దీంతో, వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్‌లో పల్టీలు కొడుతూ.. రోడ్డుపై పడిపోయింది. ట్యాంకర్‌లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక, ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్ డ్రైవర్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
A water tanker overturned on #Dommasandra-#Varthur Main Road in #Bengaluru earlier today, causing a major disruption to traffic in the area.
According to eyewitnesses, the driver lost control of the vehicle, leading to the accident.
Passersby and local residents quickly rushed… pic.twitter.com/sPtLTr6Hpg— Hate Detector 🔍 (@HateDetectors) April 14, 2025