దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న దాడులు ఆగడం లేదు.
కరీంనగర్: దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒంటిరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్లో జ్యోతి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. జ్యోతి పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.