అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే క్రిమినల్ చర్యలు | Will take criminal actions on Accounts freeze | Sakshi
Sakshi News home page

అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే క్రిమినల్ చర్యలు

Jan 10 2015 2:30 AM | Updated on Aug 16 2018 4:36 PM

తమ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆయా బ్యాంకులపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

బ్యాంకులకు ఏపీ ఉన్నత విద్యామండలి లేఖ
 సాక్షి, హైదరాబాద్: తమ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆయా బ్యాంకులపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఖాతాలను స్తంభింపచేసేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో.. ఆ బ్యాంకు అధికారులకు మండలి ఘాటైన పదజాలంతో ప్రత్యుత్తరమిచ్చింది. ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆలోచనలు చేస్తోంది. మరికొన్ని అకౌంట్లపైనా టి.మండలి లేఖలు:ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన అకౌంట్లను కూడా స్తంభింపచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యామండలి మరికొన్ని ఇతర బ్యాంకులకు లేఖలు పంపింది. శుక్రవారం శాంతినగర్ ఎస్బీఐ శాఖకు తెలంగాణ మండలి లేఖ పంపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement