భర్తను ఐరన్ రాడ్తో కొట్టి చంపిన భార్య | Wife killed Husband over family dispute in karimnagar district | Sakshi
Sakshi News home page

భర్తను ఐరన్ రాడ్తో కొట్టి చంపిన భార్య

Jul 25 2014 10:17 AM | Updated on Jul 30 2018 8:29 PM

దంపతుల మధ్య తరచూ చోటు చేసుకునే చిన్నపాటి ఘర్షణ భర్త హత్యకు దారి తీసింది. దాంతో తాళి కట్టిన భర్తను... భార్య

కరీంనగర్ :  దంపతుల మధ్య తరచూ చోటు చేసుకునే చిన్నపాటి ఘర్షణ భర్త హత్యకు దారి తీసింది. దాంతో తాళి కట్టిన భర్తను... భార్య ఐరన్ రాడ్తో దారుణంగా కొట్టి చంపింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement