ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకు? | Why narendra modi is so hurried on polavaram bill, asks ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకు?

Jul 14 2014 3:45 PM | Updated on Aug 21 2018 8:34 PM

ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకు? - Sakshi

ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకు?

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ బిల్లుపై ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోలవరాన్ని అడ్డుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

ఒక ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చానన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు 12 మంది ఎంపీలతో పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా పోలవరాన్ని ఎందుకు అడ్డుకోలేదని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. 1956కు ముందున్న తెలంగాణ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని, అందుకే ఇప్పుడు పోలవరాన్ని ఆపాలని కేంద్రాన్ని కోరలేకపోతున్నారని చెప్పారు. 1956 కంటే ముందు భద్రాచలం డివిజన్ ప్రాంతాలు గోదావరి జిల్లాల్లోనే ఉండేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement