తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీస్తామన్న బీజేపీ నాయకుల హామీ ఏమైందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
కరీంనగర్: తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీస్తామన్న బీజేపీ నాయకుల హామీ ఏమైందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం తన కార్యాలయంలో మోడీ పాలనపై భారతీయ కాంగ్రెస్ పార్టీ ‘ఆరు నెలల యూటర్న్ సర్కార్’ అనే పేరున రిలీజ్ చేసిన 30 పేజీల బుక్‌లెట్‌ను పత్రికలకు విడుదల చేశారు. పాకిస్థాన్ విషయంలో మన్మో హన్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించిన బీజేపీ ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తూ ఆ దేశంతో సంబంధాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించారు.
ఆధార్‌ను చెల్లని కాగితంగా అభివర్ణించి ఇప్పుడు ప్రతి పథకానికి ఆధార్ కార్డును లింక్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి వాటిని స్వంత పథకాలుగా చెప్పుకొని పాలన బీజేపీ నేతలు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.