పార్లమెంట్ లో నిలదీయండి:కేసీఆర్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర అన్యాయం చేయాలని చూస్తే పార్లమెంట్ నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రతీ బిల్లును పార్లమెంట్ లో అడ్డుకుంటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం ప్రకటించారు.పోలవరం ఆర్డినెన్స్, గవర్నర్ అధికారాలకు సంబంధించి మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే నిలదీస్తామన్నారు.
రేపు పార్లెమెంట్ ముందుకు వచ్చే పోలవరం ఆర్డినెన్స్, రాష్ట్ర సరిహద్దు బిల్లు అంశంలో రాజీపడవద్దని ఎంపీలకు సూచించారు. ఈ అంశాలకు సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు తమ అధినేతతో సుదీర్ఘంగా చర్చించారు. డ్రాఫ్ట్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి