రుణమాఫీకి ఆర్బీఐ ఆమోదం కావాలి: కేసీఆర్ | we committed to Farm Loan Waiver, says KCR | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి ఆర్బీఐ ఆమోదం కావాలి: కేసీఆర్

Jun 8 2014 2:35 PM | Updated on Jun 4 2019 5:04 PM

రుణమాఫీకి ఆర్బీఐ ఆమోదం కావాలి: కేసీఆర్ - Sakshi

రుణమాఫీకి ఆర్బీఐ ఆమోదం కావాలి: కేసీఆర్

ఆరునూరైనా పంటల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: ఆరునూరైనా పంటల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గబోమన్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రుణ మాఫీకి రిజర్వు బ్యాంకు ఆమోదం కావాలని వెల్లడించారు.

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు కేసీఆర్ తెలిపారు. తమ విజ్ఞాపనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. పక్షపాత వైఖరి ఉందని మోడీ హామీయిచ్చారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని సలహాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు కలిసుండాలని అభిలషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement