పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి | Vishnu vardan Reddy met in ponala | Sakshi
Sakshi News home page

పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి

Dec 18 2014 5:08 AM | Updated on Sep 2 2017 6:20 PM

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు.

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.

మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..’ అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో  ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement