ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు | Viral fevers high in Adilabad District | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

Aug 23 2014 9:40 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా... జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా... జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. దాంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి రోగులు తరలి వెళ్తున్నారు. దాదాపు 50 మంది రోగులు రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే అదే జిల్లాలోని  డిలావర్పూర్లోని గ్రామస్తులు పూర్తిగా మంచం పట్టారు.

అలాగే చెన్నూరు మండలం కొమ్మెరలోని దాదాపు 100 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వారు ఆసుపత్రులకు వెళ్ల లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ వైద్యాధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు తీవ్ర వేదన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement