కలెక్టర్‌ ఆదర్శం; ప్రశంసల వెల్లువ

Vikarabad Collector Ayesha Masrath Khanam Willing To Join Her Daughter In TMREIS - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : తన కూతురిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేరుస్తానని ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలు ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చదవడాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావించే నేటి కాలంలో.. తన కూతురిని ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించాలనుకుంటున్న ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనార్టీ గురుకులాల (టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌)కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాగా మైనార్టీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రదాయ బోధనా పద్ధతులు అవలంబిస్తూనే.. వారిని ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతోంది. ఈ క్రమంలో వికారాబాద్‌ కలెక్టర్‌ తన కూతురు తాబిష్‌ రైనాను టీఎంఆర్‌ వికారాబాద్‌ బాలికల పాఠశాల-1లో చేర్పించాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top