‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’ | venkaiah naidu mock congress over dynasty politics | Sakshi
Sakshi News home page

‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’

Jun 4 2017 1:11 PM | Updated on Sep 15 2018 3:07 PM

‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’ - Sakshi

‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’

వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

హైదరాబాద్‌: వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై తమ ప్రభుత్వం జోక్యం చేసుకోదని, కొన్ని నియమ నిబంధనలను మాత్రమే సవరించిందని చెప్పారు. గోవధపై విమర్శలు సరికావన్నారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. జమ్మూకశ్మీర్‌కు రూ. 62 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement