ధర పతనం.. కూరగాయలు ఉచితం | Vegetables free | Sakshi
Sakshi News home page

ధర పతనం.. కూరగాయలు ఉచితం

Mar 26 2016 4:23 AM | Updated on Sep 3 2017 8:34 PM

ధర పతనం.. కూరగాయలు ఉచితం

ధర పతనం.. కూరగాయలు ఉచితం

నీటి అవసరం, పెట్టుబడి తక్కువ.. ఆదాయం బాగానే వస్తుందని ఆశించి తనకున్న నాలుగెకరాల్లో కూరగాయలు సాగు చేశాడు ఖిలాషాపూర్‌కు చెందిన కావటి రాజయ్య.

రఘునాథపల్లి: నీటి అవసరం, పెట్టుబడి తక్కువ.. ఆదాయం బాగానే వస్తుందని ఆశించి తనకున్న నాలుగెకరాల్లో కూరగాయలు సాగు చేశాడు ఖిలాషాపూర్‌కు చెందిన కావటి రాజయ్య. చేతికొచ్చిన క్వింటాల్ బీరకాయలు, సుమారు 300 సొరకాయలు అమ్మేందుకు శుక్రవారం మండల కేంద్రానికి తీసుకొచ్చాడు. అరుుతే సొరకాయ ఒకటి రూ.1, బీరకాయ కిలో రూ.4 చొప్పున తీసుకుంటానని అక్కడి వ్యాపారి చెప్పాడు.

కనీసం అవి తెంపిన కూలీలకు సరిపడా డబ్బు కూడా రాకపోవడంతో.. ‘వ్యాపారి చెప్పిన ధరకు విక్రయించడం కంటే ఉచితంగా పంపిణీ చేయడమే మేలు’ అని భావించి బస్టాండ్‌వద్దకు తీసుకొచ్చాడు. ‘బీర, సొరకాయలు ఉచితం.. రండి.. తీసుకెళ్లండి’ అని చెప్పడంతో స్థానికులు, పలు గ్రామాలకు చెందిన వారు ఎగబడి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతు రాజయ్య మాట్లాడుతూ ఏ పంట వేసినా రైతుకు అప్పే మిగులుతోందని, పంటలకు మద్దతు ధర వచ్చేంత వరకు తమ బతుకులు మారవని వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement